- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్త హత్య చేశాడంటూ మృతదేహంతో యువతి కుటుంబసభ్యులు ఆందోళన
by Sathputhe Rajesh |
దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల పట్టణంలో గాంధీనగర్‌లో మమత అనే వివాహిత కిరోసిన్ పోసుకుని

X
దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల పట్టణంలో గాంధీనగర్‌లో మమత అనే వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడగా భర్త హత్య చేశాడని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ జగిత్యాల పాత బస్టాండ్‌లో మృత దేహంతో కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. సోమవారం రాత్రి ఆత్మహత్యకు యత్నించగా తీవ్రగాయాలైన ఆమెను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మంగళవారం ఆమె మృతి చెందింది. అంబులెన్స్‌లో మృతదేహాన్ని జగిత్యాలకు తీసుకు వచ్చి ధర్నాకు దిగారు.. రోడ్డుపై గంటకుపైగా ధర్నా చేయటంతో ట్రాఫిక్ స్తంభించింది. జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ ధర్నా వద్దకు చేరుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.
Next Story






