- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే, ఎంపీ అనుచరుల పోటా పోటీ నినాదాలు..
రాయికల్ మండలంలోని ధర్మాజీపేట గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (పల్లె దవాఖాన) ప్రారంభోత్సవ కార్యక్రమం రాజకీయ వేడిని రగిలించింది.

దిశ, రాయికల్: రాయికల్ మండలంలోని ధర్మాజీపేట గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (పల్లె దవాఖాన) ప్రారంభోత్సవ కార్యక్రమం రాజకీయ వేడిని రగిలించింది. కార్యక్రమానికి హాజరైన ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు శిలాఫలకంపై చివరి వరుసలో ఉండటంపై ఆయన సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభోత్సవ సందర్భంగా ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అనుచరులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేయగా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా పోటాపోటీగా నినాదాలు చేశారు.
ఫ్లెక్సీల కోసం ఖర్చు చేసే డబ్బును..
దీంతో కొంతసేపు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అనంతరం వేదికపై మాట్లాడిన ఎంపీ అరవింద్ అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు చేయవద్దని సూచించారు. పనికిమాలిన రాజకీయాలు తనతో చేయొద్దని, కాంగ్రెస్ పార్టీలో తనకు తెలియని నాయకులు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. జగిత్యాలకు వస్తే ఏ పార్టీ నాయకుడు ఏ స్లోగన్లు వినిపిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఫ్లెక్సీల కోసం ఖర్చు చేసే డబ్బును గ్రామాభివృద్ధి, పల్లె దవాఖాన అభివృద్ధికి వినియోగిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఎంపీ సూచించారు. కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల నినాదాలతో రాజకీయ వాతావరణం నెలకొంది.






