- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం వైద్యారోగ్య శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నవంబర్ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన ప్రసవాలపై సమీక్షించారు. గంగాధర పిహెచ్సిలో 28 ప్రసవాలు జరగడం పట్ల అభినందించారు. ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలు మొదటి స్క్రీనింగ్ 100 శాతం పూర్తి చేస్తూనే రెండవ స్క్రీనింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. చాలా మంది మహిళలు రెండవ సారి ఆరోగ్య మహిళ పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు.
చాలామంది ప్రజలకు అవగాహన లేక ప్రైవేటుగా మందులు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా అర్బన్ ప్రాథమిక కేంద్రం ఏరియాల్లో కాలనీల వారీగా ఆశా, ఏ.ఎన్.ఎం సహకారంతో ఇంటింటి సర్వే చేపట్టాలని అన్నారు. బిపి, షుగర్ వంటి వ్యాధులకు మందులు వాడే వారి వివరాలు సేకరించి ప్రభుత్వ మందులు ఇవ్వాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో లభించే ఉచిత మందులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎల్.ఎం.పి సర్వే సరిగ్గా చేసి గర్భిణీలకు 4 వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో జరిగేలా చూడాలని తెలిపారు.
ఆరోగ్య మహిళ, ఆయుష్మాన్ భారత్ పరీక్షలు చేయడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం పెరుగుతుందని, తద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచవచ్చని సూచించారు.బరువు తక్కువ పిల్లలను గుర్తించి ఎన్.ఆర్.సికి రిఫర్ చేయాలని అన్నారు. టీబీ పరీక్షలు పెంచాలని టీబి నిర్మూలన అధికారి ని ఆదేశించారు. టీబీ వ్యాధి అనుమానితుల నుండి నమూనాలు సేకరించి పరీక్ష కు పంపాలని పిహెచ్ సి వైద్యులను ఆదేశించారు. వైద్య సేవల్లో ముందు వరుసలో నిలిచిన మెహతాజ్ ఖానా పిహెచ్సి వైద్యులను, సిబ్బందిని అభినందించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, ఇమ్యునైజేషన్ అధికారి సాజిత, పిహెచ్ సి వైద్యులు పాల్గొన్నారు.






