- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి పనులపై కలెక్టర్ పరిశీలన
కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం కల్వకుర్తి పట్టణంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరిశీలించారు.

దిశ, కల్వకుర్తి : కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం కల్వకుర్తి పట్టణంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మాణ స్థలాన్ని సందర్శించి, ఇప్పటి వరకు పూర్తైన పనుల పురోగతి పై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి రాజీ పడకుండా నిర్మాణాన్ని కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, అవసరమైన వనరులు సమకూర్చి నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ఈ ఆసుపత్రి కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించాల్సిన 36 షాపింగ్ కాంప్లెక్స్‌లను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం డ్రా విధానంలో షాపుల కేటాయింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.






