- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం ఆదేశాలను అధికారులు తూచ తప్పకుండా అమలు చేయాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
CM's orders should be implemented without fail by officials Minister Adluri Lakshan Kumar

దిశ, జగిత్యాల ప్రతినిధి : ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను అధికారులు తూచ తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులకు నిర్వహించిన అవగాహన- శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా 10 కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారులు దృష్టి పెట్టాలని, కలెక్టర్ ప్రతిరోజూ సమీక్ష నిర్వహించాలన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తే అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగిత్యాల జిల్లాలో సాగునీటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రితో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. గిరిజన గ్రామాలు, తండాలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. అలాగే చెల్‌గల్ సమీపంలో కేంద్రీయ విద్యాలయం లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూములు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మున్సిపల్ చైర్మన్లు, కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు.






