సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఎన్నిక‌ల‌ కోడ్ ఉల్లంఘననే : మాజీ జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ దావ వ‌సంత

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-01 10:28:37  IST  )

దిశ, జగిత్యాల ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేయడం స్పష్టమైన కోడ్ ఉల్లంఘన అని మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్

సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఎన్నిక‌ల‌ కోడ్ ఉల్లంఘననే : మాజీ జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ దావ వ‌సంత
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేయడం స్పష్టమైన కోడ్ ఉల్లంఘన అని మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత ఆరోపించారు. జగిత్యాలలో సోమవారం వసంత మీడియాతో మాట్లాడారు. నవంబర్ 26న ఎలక్షన్ కమిషన్ కోడ్ అమలుపై స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా సీఎం ప్రభుత్వ ఖర్చుతో మీటింగ్‌లు పెట్టడం సరికాదన్నారు. రాజ్యాంగాత్మక సంస్థలను అపహాస్యం చేస్తూ, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు కల్పించేలా పర్యటనలు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో జగిత్యాల బీఆర్‌ఎస్ తరఫున సీఎం పర్యటనను వెంటనే నిలిపివేయాలని ఎలక్షన్ కమిషన్‌కు డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, బీఆర్‌ఎస్ నాయకులు శీలం ప్రవీణ్ పాల్గొన్నారు.

Next Story