- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం : కాంగ్రెస్ ఇన్ చార్జి కే.కే. మహేందర్ రెడ్డి
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ చార్జి కే.కే. మహేంధర్ రెడ్డి అన్నారు.

దిశ, ఎల్లారెడ్డిపేట : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ చార్జి కే.కే. మహేంధర్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం సేవాలాల్ తండా నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఏఎంసీ చైర్మన్ షేక్ సబేరా, సర్పంచ్ రజిత సంతోష్ నాయక్ తో కలిసి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఫెర్టిలైజర్ విక్రయ కేంద్రాలను, పెట్రోల్ బంకులను, గ్యాస్ సరాఫరా కేంద్రాలన్నిటీని కూడా మహిళలను ప్రోత్సాహించే దిశగా.. ఒక ఇల్లు బాగుపడితే ఆ ఇల్లాలితో పాటు ఆ ఊరు బాగుపడుతుంది అని అన్నారు. ఈ తల్లి ఈ తండాకు సర్పంచ్ రజిత అయిందంటే.. ఇది కాంగ్రెస్ పార్టీ ఘనతే నన్నారు. దివంగత భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రభుత్వం స్థానిక సంస్థలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
సామాజిక సాధికారత, రాజ్యాంగ సాధికారిక ఆర్థిక సాధికారిత వైపు మహిళలను నడిపించాలన్నారు. మహిళా బిల్లును ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టే అన్నారు. ఏది ఏమైనప్పటికీ పార్టీలు ఏమైనప్పటికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధే బాధ్యతగా తాను తీసుకొని సేవాలాల్ తండా గ్రామపంచాయతీ సమస్యలను తీర్చే దిశగా తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలియజేశారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షలు సీసీ రోడ్డు నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కొత్త గ్రామపంచాయతీ కాబట్టి సమస్యలు అనేకంగా ఉంటాయని వాటిని పరిష్కరించదశగా పని చేద్దామన్నారు. తిమ్మాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉండే సేవాలాల్ తండా గ్రామపంచాయతీ తో పాటు రాచర్ల బాకురుపల్లి గ్రామపంచాయతీ ఏర్పడిందని గ్రామపంచాయతీకి సుమారు 60 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ అందే సుభాష్, ఉప సర్పంచ్ దేవేందర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






