- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కోసం రైతుల మధ్య ఘర్షణ
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ సహకార సంఘం యూరియా కోసం గోదాం వద్ద రైతులు ఘర్షణకు దిగారు.

దిశ, సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ సహకార సంఘం యూరియా కోసం గోదాం వద్ద రైతులు ఘర్షణకు దిగారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి రైతులు యూరియా కోసం గోదాం వద్ద క్యూలైన్ కట్టారు. ఒక రైతు క్యూ లైన్ లో కాకుండా నేరుగా రావడం తో ఆగ్రహించిన రైతులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ పోలీసులు దాడికి దిగిన రైతులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.
రైతులను కంట్రోల్ చేయలేక పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సహకార సంఘం గోదాముకు రైతులకు సరిపడా యూరియా రాకపోవడంతో, వచ్చిన బస్తాల సంఖ్య తక్కువగా ఉండడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున ఇచ్చిన యూరియా సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పంటకు సరిపడా యూరియా సకాలంలో అందించాలని, పంట నష్టం కాకుండా ప్రభుత్వ అధికారులు, నాయకులు స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.






