చొప్పదండి ప్రజలే నాకు దేవుళ్ళు : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

by Nallavelli.Anjaneyulu |

చొప్పదండి ప్రజలే నాకు దేవుళ్ళతో సమానమని నా చివరి రక్తపు బొట్టు దార పోసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

చొప్పదండి ప్రజలే నాకు దేవుళ్ళు : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
X

దిశ, కొడిమ్యాల : చొప్పదండి ప్రజలే నాకు దేవుళ్ళతో సమానమని నా చివరి రక్తపు బొట్టు దార పోసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శనివారం పూడూరు గ్రామ సమీపంలో గల ఎల్ కే గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే మండలాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని గ్రామాలలో ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకు రావలసిందిగా ఆయన పేర్కొన్నారు.


అధికారులు గ్రామాల్లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని గ్రామ సమస్యల పరిష్కారానికి అందరం కలిసి పని చేద్దామని, రానున్న రోజుల్లో చొప్పదండి నియోజక వర్గాన్ని మోడల్ కాన్స్టెన్సీగా తీర్చిదిద్దుకునే బాధ్యత మనందరి పైన ఉందని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఆర్డీవో, ఎమ్మార్వో స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు, రైతులను ఇబ్బంది పెడుతున్న మిల్లర్లను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకడే, నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు మండల స్థాయి అధికారులు చైర్మన్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజలు పాల్గొన్నారు.

Next Story