Choppadandi MLA : సీసీఐకి నాణ్యమైన పత్తి తీసుకొచ్చి మొదటి రకం ధరను పొందాలి..

by Chintha Aamani |   (  Updated:2024-11-04 09:27:58  IST  )

మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో శివ శివాని కాటన్ జిన్నింగ్ మిల్లులో

Choppadandi MLA : సీసీఐకి నాణ్యమైన పత్తి తీసుకొచ్చి మొదటి రకం ధరను పొందాలి..
X

దిశ,చొప్పదండి: మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో శివ శివాని కాటన్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. అనంతరం చా కుంట గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు వెదురు గట్ట గ్రామంలో డీసీఎంఎస్ ద్వారా కొత్తగా అనుమతులు పొంది రైతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ మేరకు సత్యం మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సీసీఐ కి నాణ్యమైన పత్తి తీసుకొచ్చి మొదటి రకం ధరను పొందాలన్నారు.

అనుమతులు లేకుండా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా తక్కువ ధరలకు కొంటూ రైతులను మోసం చేయాలని చూస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం వెదురు గట్ట గ్రామంలో తాటి చెట్టు పైనుండి పడి నడుం విరిగి మంచానికే పరిమితమైన గీత కార్మికుడు మడ్డి లచ్చయ్యను, భూపాలపట్నం గ్రామానికి చెందిన ఎనగందుల సుకుమార్ చిన్న వయసులోనే అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ఇరు కుటుంబాలకు రూ. 5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. రాబోవు రోజుల్లో వీరు కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకోవడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story