చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీల ఖరారు!

by Ratna Kumari |

చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా సరికొత్త కమిటీలను అధిష్ఠానం ప్రకటించింది.

చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీల ఖరారు!
X
దిశ, గంగాధర : చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా సరికొత్త కమిటీలను అధిష్ఠానం ప్రకటించింది. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సంప్రదింపులు, ప్రతిపాదనల మేరకు.. నియోజకవర్గంలోని పలు మండలాలు, టౌన్ నూతన అధ్యక్షుల నియామకానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గంలోని కీలకమైన నాలుగు ప్రాంతాలకు నూతన అధ్యక్షులను తక్షణమే అమలులోకి వచ్చేలా నియమించారు. చొప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, చొప్పదండి టౌన్ అధ్యక్షుడిగా నిజానపురం చందు నియమితులయ్యారు.

అలాగే రామడుగు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా జవ్వాజి హరీష్, గంగాధర మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంత్రి మహేందర్‌లను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నూతన అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి నూతన అధ్యక్షులు అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క కార్యకర్తను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తమకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు నూతన అధ్యక్షులు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story