వేములవాడ మున్సిపల్ పరిధిలో చిరుత కలకలం

by Nallavelli.Anjaneyulu |

వేములవాడ మున్సిపల్ పరిధిలోని హన్మక్కపల్లిలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన రోమాల భూమయ్య అనే రైతుకి చెందిన ఆవు దూడపై అర్ధరాత్రి వేళ చిరుత దాడి చేయగా అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

వేములవాడ మున్సిపల్ పరిధిలో చిరుత కలకలం
X

దిశ, వేములవాడ టౌన్ : వేములవాడ మున్సిపల్ పరిధిలోని హన్మక్కపల్లిలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన రోమాల భూమయ్య అనే రైతుకి చెందిన ఆవు దూడపై అర్ధరాత్రి వేళ చిరుత దాడి చేయగా అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ రేంజ్ అధికారి ఖలీలుద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని పాదముద్రల ఆధారంగా దాడి చేసింది చిరుత పులి అని నిర్ధారించారు. పొలాలకు వెళ్ళే రైతులు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాలకు దగ్గరగా పశువులను కట్టేయవద్దని, ఒంటరిగా పొలాలకు వెళ్ళవద్దని సూచించారు. చిరుత జాడ తెలిస్తే అటవీ శాఖాధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మరోవైపు విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు రైతును ఓదార్చి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో నష్టపోయిన రైతుకు నష్ట పరిహారం అందించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా వేములవాడ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Next Story