- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్పత్రి బిల్లు కట్టడానికి బంగారం అమ్ముతుండగా మోసం
కుమారుడి హాస్పిటల్ బిల్లు కట్టడం కోసం బంగారం అమ్ముకోవడానికి ప్రయత్నించిన మహిళను మోసం చేసి, ఆ బంగారం ఎత్తుకెళ్లిన ఇద్దరు నిందితులను జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, జగిత్యాల టౌన్: కుమారుడి హాస్పిటల్ బిల్లు కట్టడం కోసం బంగారం అమ్ముకోవడానికి ప్రయత్నించిన మహిళను మోసం చేసి, ఆ బంగారం ఎత్తుకెళ్లిన ఇద్దరు నిందితులను జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించారు. టౌన్ సిఐ కరుణాకర్ వివరాల ప్రకారం.. కథలాపూర్ మండలం తాండ్రయల గ్రామానికి చెందిన గండి లలిత తన కుమారుడి అనారోగ్యం కారణంగా జగిత్యాల జంబిగద్దె సమీపంలోని మహదేవ హాస్పిటల్‌కు వచ్చింది. వైద్యం అనంతరం హాస్పిటల్ బిల్లు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో, ఆమె తన మెడలోని బంగారం అమ్ముకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను నమ్మించి, మోసం చేశారు. ఆ సొమ్ముతో పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... శుక్రవారం జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వేములవాడ మండలం షాత్రాజ్ పల్లికి చెందిన కత్తెరపాక దేవేందర్, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్‌కు చెందిన నంద్యాల తిరుపతిరావు గా గుర్తించారు.






