- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
17వ బెటాలియన్ నూతన కమాండెంట్‌గా ఛటర్జీ
17వ బెటాలియన్‌కు నూతన కమాండెంట్‌గా పి.జె.పి.సి. ఛటర్జీ నియమితులైయ్యారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: 17వ బెటాలియన్‌కు నూతన కమాండెంట్‌గా పి.జె.పి.సి. ఛటర్జీ నియమితులైయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ శాఖలో విధులు నిర్వహిస్తున్న కమాండెంట్ ఛటర్జీ సాధారణ బదిలీపై సిరిసిల్ల 17వ పోలీస్ బెటాలియన్ లో సోమావారం నూతన కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నూతన కమాండెంట్ ఛటర్జీ మాట్లాడుతూ, బెటాలియన్ క్రమశిక్షణ, సమర్థత, ప్రజాసేవకు ప్రాధాన్యం ఇస్తూ సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి బెటాలియన్ ప్రతిష్ఠను మరింత పెంచాలని ఆయన సూచించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో సమావేశమై బెటాలియన్ నిర్వహణ, భద్రతా చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.






