టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మ‌న్ గా చంద్ర‌శేఖ‌ర్

by Ratna Kumari |

తెలంగాణ పీసీసీ ఎస్సీ సెల్ వైస్ ఛైర్మన్ గా మండల కేంద్రానికి చెందిన డా. కొలపురి చంద్ర శేఖర్ ను నియమించినట్లు రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, మానుకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.

టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మ‌న్ గా చంద్ర‌శేఖ‌ర్
X

దిశ, పెగడపల్లి : తెలంగాణ పీసీసీ ఎస్సీ సెల్ వైస్ ఛైర్మన్ గా మండల కేంద్రానికి చెందిన డా. కొలపురి చంద్ర శేఖర్ ను నియమించినట్లు రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, మానుకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చంద్ర శేఖర్ కు డిల్లీలో ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ రాజేందర్ పాల్ గౌతం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్ర శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ ఎస్సీ సెల్ విభాగం బలోపేతానికి కృషి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తానని రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే విధంగా తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. త‌న‌ నియామకానికి సహకరించిన ఏఐసీసీ ఎస్సీ సెల్ కో ఆర్డినేటర్ కొప్పుల రాజు, రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణకి రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story