రాష్ట్ర ఉత్తమ గ్రామ పంచాయతీగా చామనపల్లి..మంత్రి కొండా సురేఖ ప్రశంసలు..

by Bhanu |

కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర ఉత్తమ పంచాయతీ అవార్డు దక్కించుకుంది.

రాష్ట్ర ఉత్తమ గ్రామ పంచాయతీగా చామనపల్లి..మంత్రి కొండా సురేఖ ప్రశంసలు..
X

దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర ఉత్తమ పంచాయతీ అవార్డు దక్కించుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ను పూరష్కరించుకొని గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ,పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి కోరుకంటి మహేందర్ రావుకు అవార్డ్ , ప్రశాంస పత్రాన్ని అందజేశారు. ఈ అవార్డ్ కు రాష్ట్రంలో 3 గ్రామ పంచాయతీలు ఎంపిక చేయగా, చామనపల్లి గ్రామం మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి జగన్ మోహన్ రెడ్డి పంచాయతి కార్యదర్శి కె.మహేందర్ రావు లను,సిబ్బందిని మంత్రి అభినందించారు. చామనపల్లిలో సాలిడ్ వెస్ట్ మేనేజ్ మెంట్, స్వచ్చదనం, పచ్చదనం


సక్రమ నిర్వహణ,సెగ్రీగెషన్, కంపోస్ట్ ప్రిపరేషన్, విటమిన్ గార్డెన్, ప్లాస్టిక్ వ్యర్థల సక్రమ నిర్వహణ, పునర్వినియోగం,ప్లాంటేషన్, నర్సరీ, కమ్యూనిటీ సోక్ పిట్స్ తదితర అంశాల్లో చామనపల్లి అత్యుత్తమ పనితీరు కనబరచినందున రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అవార్డు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు (ఎంపీవో,ప్రత్యేక అధికారి) జగన్ మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్ IAS,TSPCB మెంబర్ సెక్రటరి రవి IAS, గ్రామ పంచాయతీ సిబ్బంది ఆంజనేయులు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.



Next Story