- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలు ఉపయోగపడుతాయి
వేసవికాలంలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల్ల హరీశ్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, గోదావరిఖని : వేసవికాలంలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల్ల హరీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మూడు చోట్ల చలివేంద్రాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. గోదావరి ప్రధాన చౌరస్తాలో, బీ పవర్ హౌస్, ఎనిమిదో కాలనీలో చలివేంద్రాలు ఎండాకాలం మొత్తం ప్రజలకు త్రాగునీరు అందిస్తాయన్నారు. బాటసారుల, వాహనదారులు, వృద్ధులు చల్లని త్రాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని హరీష్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కడమల్ల శ్రీహరి, రోడ్డ సంపత్, ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకులు కన్నూరి ధర్మేందర్, పల్లె బాపు, కాసిపేట సదానందం, వడ్లూరి శ్రీను, మార్పల్లి శ్రీను, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పోయిల రవి, అనిల్, ప్రవీణ్ పాల్గొన్నారు.






