- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖనిలో చైన్ స్నాచింగ్ !
by Batti.Sumithra |
గోదావరిఖని పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది.

X
దిశ, గోదావరిఖని : గోదావరిఖని పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. పట్టణంలోని జీఎం కాలనీలో నివాసం ఉంటున్న సలిగంటి కొమరమ్మ మెడలోని 35 గ్రాముల బంగారు చైన్‌ను ఆగంతకుడు దొంగిలించుకుపోయాడు. బాధితురాలు గోదావరిఖని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం రాత్రి కొమురమ్మ తన భర్తతో ఇంట్లో ఉండగా ఆ క్రమంలో ఓ ఆగంతకుడు తలుపు తట్టి పిలిచాడు.
కొమరమ్మ ఎవరో వచ్చారని తలుపు తీయగా.. అగంతకుడు మెడలో ఉన్న గొలుసును దొంగలించినట్లుగా ఆమె ఫిర్యాదు చేసింది. దీని విలువ రూ. 90 వేల వరకు ఉంటుందని పేర్కొంది. దొంగతనం జరుగుతున్న క్రమంలో జరిగిన పెనుగులాటలో కొమురమ్మ మెడకు గాయమవడంతో, తీవ్ర భయాందోళనకు గురైంది. బాధితురాలి ఫిర్యాదుతో ఖని పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story






