హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తోనే సర్వైకల్ క్యాన్సర్‌కు చెక్ : క‌లెక్ట‌ర్ కోయ శ్రీహ‌ర్ష

by Ratna Kumari |

మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతో కీలకమని క‌లెక్ట‌ర్ కోయ శ్రీహ‌ర్ష సూచించారు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తోనే సర్వైకల్ క్యాన్సర్‌కు చెక్ :  క‌లెక్ట‌ర్ కోయ శ్రీహ‌ర్ష
X

దిశ, పెద్దపల్లి : మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతో కీలకమని క‌లెక్ట‌ర్ కోయ శ్రీహ‌ర్ష సూచించారు. 14 సంవ‌త్స‌రాలు నిండిన బాలిక‌లంద‌రికీ ఈ వ్యాక్సిన్ వేయించాల‌ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ క‌డ‌మంచి శివ ఆధ్వ‌ర్యంలో రూపొందించిన పోస్ట‌ర్ ను పెద్ద‌ప‌ల్లి క‌లెక్ట‌ర్ కోయ శ్రీహ‌ర్ష ఆవిష్క‌రించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ కేవలం సినిమా పరంగానే కాకుండా, సామాజిక బాధ్యతగా భావించి మహిళల ఆరోగ్యం కోసం ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన హీరో అల్లు అర్జున్‌ను, ఆయన అభిమానులను ప్రత్యేకంగా అభినందించారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడూ ముందుండటం హర్షణీయమని ఆయన కొనియాడారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఆవశ్యకతను వివరిస్తూ అప్పన్నపేటలోనూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సౌమ్య పాల్గొని, సర్వైకల్ క్యాన్సర్ బారి నుంచి మహిళలను రక్షించుకోవడంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమాల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు బొంకూరి మధు, మనోజ్, అజయ్, మధు, సాగర్, అభి, ప్రవీణ్, సాయి, వెంకటేష్, శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story