శతకం దాటిన వృద్ధురాలు.. ఘనంగా పుట్టిన రోజు వేడుకలు

by Bhanu |

మారుతున్న జీవన శైలి లో మనిషి మనుగడ ఆరవై సంవత్సరాలు కూడా దాటడం లేదు. అలాంటిది ఒకావిడ శతకం దాటి ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటుందంటే ఆశ్చర్యమే..

శతకం దాటిన వృద్ధురాలు.. ఘనంగా పుట్టిన రోజు వేడుకలు
X

దిశ,పెగడపల్లి : మారుతున్న జీవన శైలి లో మనిషి మనుగడ ఆరవై సంవత్సరాలు కూడా దాటడం లేదు. అలాంటిది ఒకావిడ శతకం దాటి ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటుందంటే ఆశ్చర్యమే.. అలాంటి ఆవిడకు కొడుకులు,కూతుర్లు,మనుమలు, మనుమరాళ్లు అందరూ కలిసి పుట్టిన రోజు వేడుకలను పండగలా నిర్వహించారు.ఇంతకీ ఎవరు ఆవిడ..ఎక్కడ ఉంది అనే వివరాల్లోకి వెళ్తే మండలం లోని రాజరాం పల్లి తండా కి చెందిన ఇస్లావత్ శ్యామల వయస్సు వందకు పైగా ఉంది.శ్యామల కి ఎనిమిది మంది కుమారులు,నలుగురు కూతుర్లు కాగా భర్త లక్ష్మణ్ నాయక్ ఇరవై తొమ్మిదేళ్ళ క్రితం మరణించాడు.శ్యామల వంద సంవత్సరాలు దాటిన ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటూ ఉంటూ మూడు తరాల వారికి ఆదర్శంగా నిలిచిన శ్యామలకు కుటుంబ సభ్యులు పుట్టిన రోజు వేడుకలను పండగలా నిర్వహించారు. అట్టి పుట్టిన రోజు వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story