- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొగ్గు నిల్వలపై సీబీఐ విచారణ చేపట్టాలి
సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై యజమాన్యం చెబుతున్న తప్పుడు లెక్కలపై సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి డిమాండ్ చేశారు.

దిశ, గోదావరిఖని : సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై యజమాన్యం చెబుతున్న తప్పుడు లెక్కలపై సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి డిమాండ్ చేశారు. గురువారం రామగుండం రీజియన్ లోని పలు బొగ్గు గనుల పైన ఉన్న బొగ్గు నిల్వలను టీబీజీకేఎస్ బృందం పరిశీలించింది. యాజమాన్యం ప్రకటించిన విధంగా బొగ్గు నిల్వలు లేవని, కోల్ డంపింగ్ యార్డ్ ఖాళీగా కనబడుతున్నాయని వెల్లడించారు. రామగుండం ఓసీపీ 5వ గనిలో అత్యధికంగా బొగ్గు విలువలు ఉన్నాయని యాజమాన్యం వివరించిందని ఆరోపించారు. వాటిని సందర్శించడానికి మాత్రం అనుమతించలేదని, సుమారు మూడున్నర లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారులు తెలపటం విడ్డూరంగా ఉందన్నారు.
వాస్తవంగా బొగ్గు నిల్వలు 40 వేల టన్నులకు లేవని పేర్కొన్నారు. బొగ్గు నిల్వచేసే ప్రాంతాలలో షేల్ బొగ్గు, బండలు, కాలిపోయిన బొగ్గు బూడిద మాత్రమే దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. రామగుండంలో బొగ్గు నిల్వలు లేవని తమ పరిశీలనలోనూ అందిన సమాచారం ప్రకారం తెలుస్తుందని వెల్లడించారు. బొగ్గు నిలువల తనిఖీ కోసం టీబీజీకేఎస్ బృందాన్ని అనుమతించకపోవడం అంటేనే బొగ్గు నిలువలు లేవని అంగీకరించడం అని ఆయన పేర్కొన్నారు. రామగుండం డివిజన్ వన్ లో బొగ్గు నిలువలు పేరుకుపోయినట్లయితే బొగ్గు రవాణా ఎందుకు తగ్గుతున్నదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రామగుండం డివిజన్ వన్ బొగ్గు ఉత్పత్తిలో సింహభాగం ఓసిపి 5వ గనిదే, అలాంటప్పుడు బొగ్గు రవాణా ఎందుకు జరగటం లేదని, ఇది అనేక అనుమానాలకు కారణమని కూడా వెల్లడించారు. ఆయన వెంట టీబీజీకేఎస్ కేంద్ర నాయకులు పోలాడి శ్రీనివాసరావు, ఆర్ జీవన్ ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్ ఉన్నారు.






