మరోసారి గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తా.. తెగేసి చెప్పిన సర్పంచ్

by Sathputhe Rajesh |   (  Updated:2022-03-18 14:30:07  IST  )

దిశ, రామడుగు: కాలనీవాసుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులు మ

మరోసారి గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తా..  తెగేసి చెప్పిన సర్పంచ్
X

దిశ, రామడుగు: కాలనీవాసుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులు మరోసారి గెలిపిస్తే పనులు చేస్తామని కాలనీవాసులకు జులుం విధిస్తున్నారు. రామడుగు మండలంలోని గోపాల్రావుపేట గ్రామ 13,14 కాలనీవాసుల సమస్యలను గ్రామ సర్పంచ్ కర్ర సత్య ప్రసన్నకు విన్నవించగా.. కాలనీకి వచ్చి సమస్యలను నేరుగా చూశారు. మరోసారి తనను గెలిపిస్తే కాలనీ సమస్యలను పరిష్కరిస్తానని జులుం విధించారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీ సమస్యలు తీర్చాల్సిన గ్రామ సర్పంచ్ ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కాలనీ సమస్యలు ఏ ప్రజాప్రతినిధి అయినా పట్టించుకోని సమస్యలను నెరవేర్చగలరని వేడుకుంటున్నారు.





Next Story