కారు-బైక్ ఢీ...అయ్యప్ప భక్తులకు పెను ప్ర‌మాదం

by velandi.Saikiran |

కరీంనగర్/పెద్దపల్లి జిల్లాల సరిహద్దులో విషాద ఘటన చోటుచేసుకుంది. కార్తీకమాసం సందర్భంగా మాలధారణలో ఉన్న భక్తులు బైక్‌పై

కారు-బైక్ ఢీ...అయ్యప్ప భక్తులకు పెను ప్ర‌మాదం
X

దిశ, మానకొండూరు: కరీంనగర్/పెద్దపల్లి జిల్లాల సరిహద్దులో విషాద ఘటన చోటుచేసుకుంది. కార్తీకమాసం సందర్భంగా మాలధారణలో ఉన్న భక్తులు బైక్‌పై ఇంటికి వ‌స్తున్నారు. ఈ త‌రుణంలోనే శ్రీ మానేటి రంగనాయక స్వామి ఆలయం సమీపంలోని బ్రిడ్జిపై కారు ఢీకొనడంతో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం, మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు అయ్యప్ప భక్తులు బుధవారం లక్షేట్ పేట్ మండలం గూడెం గుట్ట గురుస్వామి వద్ద అయ్యప్ప మాల వేసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా దూసుకొచ్చి వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బత్తిని వీరస్వామి గౌడ్ కాలు నుజ్జు అయింది. నందికొండ రాం రెడ్డి కాలు, నడుము విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సుల్తానాబాద్ పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story