కారు, స్కూటీ ఢీ...ఇద్దరు స్పాట్ డెడ్

by velandi.Saikiran |

స్కూటీ, కారు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

కారు, స్కూటీ ఢీ...ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: స్కూటీ, కారు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని చందూర్తి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పిట్టల అంజయ్య-నీరజ ఇద్దరు కూతుళ్లు. ఇటీవల పెద్ద కుతూరుకు జ్వరం వచ్చి కొనరావుపేట మండలం నిమ్మపల్లి అమ్మ వాళ్ళ ఇంటికి నీరజ... ఇద్దరు కూతుళ్లతో వెళ్ళింది. ఇక గురువారం నీరజ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి, ఇద్దరు కూతుళ్ళతో అత్తవారింటికి బయలుదేరింది.

ఈ క్రమంలో సిరిసిల్లలో తెలిసిన వ్యక్తి స్కూటీపై తన పెద్ద కూతురును ఎక్కించి, నీరజ ఆటోలో సిరిసిల్ల మొదటి బైపాస్ గుండా ప‌య‌నం అయ్యారు. ఈ క్రమంలో కే-కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న స్కూటీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పిట్టల సాన్వీత (9), మేస్త్రి పనిచేసుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజేరియా(37) అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Next Story