- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాదిగ అమరవీరులకు ఘన నివాళి.. కొవ్వొత్తుల ప్రదర్శన
ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో ప్రాణాలర్పించిన మాదిగ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ పేర్కొన్నారు.

దిశ,హుజూరాబాద్ రూరల్: ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో ప్రాణాలర్పించిన మాదిగ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ పేర్కొన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాదిగ అమరవీరుల సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్లుగా సాగిన పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని, వారి బలిదానాల వల్లే నేడు ఎస్సీ వర్గీకరణ ఫలాలు దక్కుతున్నాయని కొనియాడారు. సుప్రీంకోర్టు తీర్పుతో లభించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని అమరవీరులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.
అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మాదిగ జాతి బిడ్డలు ఉన్నత విద్యావంతులై అభివృద్ధి చెందడమే వారికిచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రుద్రారపు రామచంద్రం, మారేపల్లి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు వర్థినేని రవీందర్రావు, బొరగాల మొగిలి, మహ్మద్ ఖాలీక్ హుస్సేన్, బండ వెన్నెల ప్రవీణ్. ఎంఈఎఫ్ జిల్లా కార్యదర్శి డాక్టర్ తడికమళ్ల శేఖర్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి రవీందర్, మహిళా నాయకురాలు ప్రియదర్శిని, వేల్పుల రత్నం, సీనియర్ నాయకులు కలవల మల్లయ్య, కుమార్, సమ్మయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






