కాలిన ట్రాన్స్ ఫార్మర్.. ఆందోళనలో అన్నదాతలు

by Elthuri vijay kumar |

వరి సాగు చేస్తున్న రైతులు ఒక వైపు కావాల్సినంత యూరియా దొరకక ఇబ్బందులు పడుతుంటే మరొక వైపు పొలాలకు సాగు నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయి పొలాలు ఎండుతున్నా అధికారులు పట్టించుకోక రైతులు ఆందోళన చెందుతున్నారు.

కాలిన ట్రాన్స్ ఫార్మర్.. ఆందోళనలో అన్నదాతలు
X

కాలిన ట్రాన్స్ ఫార్మర్.. ఆందోళనలో అన్నదాతలు

- ఎండుతున్న పంటలు

- పట్టించుకోని విద్యుత్ అధికారులు

- త్వరగా మరమ్మతు చేయాలని రైతుల వేడుకోలు

దిశ, పెగడపల్లి : వరి సాగు చేస్తున్న రైతులు ఒక వైపు కావాల్సినంత యూరియా దొరకక ఇబ్బందులు పడుతుంటే మరొక వైపు పొలాలకు సాగు నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయి పొలాలు ఎండుతున్నా అధికారులు పట్టించుకోక రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని లింగాపూర్ పెద్ద చెరువు మత్తడి వైపు ఉన్న వ్యవసాయ భూములకు సాగు నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయి సుమారు నెల రోజులు కావస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదే పదే అధికారుల చుట్టూ తిరుగుతుంటే ట్రాన్స్ ఫార్మర్ అందుబాటులో ఉంటే సమాచారం ఇస్తాం వెళ్లి తీసుకుని రండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని మండిపడ్డారు. దిగువన ఉన్న పొలాలకు కెనాల్ ద్వారా సాగు నీరు అందుతుందని ఎగువన ఉన్న పొలాలకు సాగు నీరు ఇబ్బంది అవుతుందని ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం విడనాడి పొలాలను కాపాడాలని కోరుతున్నారు.

Next Story