విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి

by Kema Shiva Kumar |

విద్యుత్ షాక్ తో ఓ ఎద్దు మృతి చెందిన ఘటన రామడుగు మండలం షానగర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి
X

దిశ, రామడుగు : విద్యుత్ షాక్ తో ఓ ఎద్దు మృతి చెందిన ఘటన రామడుగు మండలం షానగర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రైతు బైరి అనిల్ షానగర్ గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో సోమవారం సాయంత్రం తనకున్న ఎద్దును కట్టేసి అక్కడి నుంచ వెళ్లిపోయాడు. ఉదయం లేచి పొలం వద్దకు వెళ్లేసరికి ట్రాన్స్ ఫార్మర్ వద్ద తన ఎద్దు చనిపోయి ఉంది. తన ఎద్దు ఎత్తుగా ఉండడంతో కరెంట్ తీగలు కిందికి ఉండడం వల్ల కరెంట్ షాక్ తో ఎద్దు మరణించినట్లు రైతు అనిల్ తెలిపాడు. సుమారు ఎద్దు విలువ రూ.50 వేల వరకు ఉంటుందని, ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

Next Story