- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకుంటాం
by velandi.Saikiran |
నియోజకవర్గంలోని జడ్పిటిసి ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంటామని కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్

X
దిశ, మెట్ పల్లి: నియోజకవర్గంలోని జడ్పిటిసి ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంటామని కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. సోమవారం మెట్ పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ...ఎన్నికల్లో దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కినాక ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి తీరును ప్రతి ఇంటికి వివరించాలని కార్యకర్తలకు తెలిపారు.ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే కసితో ఉన్నారని బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం తత్యం అని వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






