జమ్మికుంట మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవ‌సం

by Ratna Kumari |

ఎట్ట‌కేల‌కు జ‌మ్మికుంట మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవ‌సం చేసుకుంది. ఇటీవ‌ల వెలువ‌డిన‌ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, బీజేపీ 4, ఏఐఎఫ్‌బీ 1, ముగ్గురు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

జమ్మికుంట మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవ‌సం
X

దిశ, జమ్మికుంట : ఎట్ట‌కేల‌కు జ‌మ్మికుంట మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవ‌సం చేసుకుంది. ఇటీవ‌ల వెలువ‌డిన‌ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, బీజేపీ 4, ఏఐఎఫ్‌బీ 1, ముగ్గురు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. తొలుత స్వ‌తంత్ర అభ్య‌ర్థులు అధికార కాంగ్రెస్ మ‌ద్ద‌తు తెల‌ప‌గా.. ఆ త‌రువాత హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి త‌న రాజ‌కీయాన్ని ప్ర‌ద‌ర్శించి జ‌మ్మికుంట మున్సిపాలిటీని కైవ‌సం చేసుకున్నారు. స్వ‌తంత్రులుగా విజ‌యం సాధించిన ముగ్గురు అభ్య‌ర్థులు బీఆర్ఎస్ లో చేరారు. హుజూరాబాద్ ఆర్డీవో ర‌మేష్ బాబు అధ్య‌క్ష‌త‌న చైర్మ‌న్ గా ములుగు ప్ర‌శాంత్ కుమార్, వైస్ చైర్మ‌న్ గా ఎం.డీ. జావిద్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. గ‌తంలో చైర్మ‌న్ గా కొన‌సాగిన త‌క్క‌ల్ల‌ప‌ల్లి రాజేశ్వ‌ర‌రావు స‌తీమ‌ణిపై గెలుపొందిన మొలుగు ప్ర‌శాంత్ కుమార్ ప్ర‌స్తుతం చైర్మ‌న్ గా కొన‌సాగ‌నున్నారు. గ‌తంలో వైస్ చైర్మ‌న్ గా కొన‌సాగిన దేశిని కోటిపై విజ‌యం సాధించిన మ‌రో కౌన్సిల‌ర్ ఎం.డీ. జావిద్ వైస్ చైర్మ‌న్ గా ఎన్నిక‌వ్వ‌డం విశేషం. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో జ‌మ్మికుంట మున్సిపాలిటీ చైర్మ‌న్ ఎన్నిక సాగింద‌ని అధికారులు తెలిపారు.

రెండు పార్టీల మ‌ద్ద‌తు ప్ర‌శాంత్ కుమార్

23వ వార్డు కౌన్సిల‌ర్ గా స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా మొలుగు ప్ర‌శాంత్ కుమార్ గెలుపొందారు. సోమ‌వారం ఉద‌యం కాంగ్రెస్ క్యాంపులోనే కౌశిక్ రెడ్డి బెదిరించి ప్ర‌శాంత్ కుమార్ బీఆర్ఎస్ కండువా క‌ప్పి చైర్మ‌న్ గా ప్ర‌మాణ స్వీకారం చేయించ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌గా.. దీనిపై తాము అభ్యంత‌రం తెలిపామ‌ని బీఆర్ఎస్ కండువా తీసేసి ప్ర‌మాణ స్వీకారం చేశాడ‌ని.. ప్ర‌శాంత్ కుమార్ కు కాంగ్రెస్ మ‌ద్ద‌తు తెలిపింద‌ని త్వ‌ర‌లోనే జ‌మ్మికుంట అభివృద్ధికి ప్ర‌శాంత్ కుమార్ కాంగ్రెస్ కి వ‌స్తాడ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Next Story