- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ పార్టీ శిఖండి రాజకీయాలు చేస్తోంది : మంత్రి లక్ష్మణ్ కుమార్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

దిశ, ధర్మారం : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడానికి ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో అధికారుల ప్రమేయం కంటే కేసీఆర్ తానే ఇంజనీర్ గా ముందుకు వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును కూళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని మంత్రి అన్నారు. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 20న మేడిగడ్డ సందర్శనకు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ను కేటీఆర్ ను ఎక్కువ సార్లు విమర్శించిన వ్యక్తి జీవన్ రెడ్డి అని మంత్రి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం గా మార్చారని పేరు పెట్టింది జీవన్ రెడ్డి అని మంత్రి గుర్తు చేశారు. జీవన్ రెడ్డి పార్టీ మారే విషయంపై స్థానిక నాయకత్వం నుండి జాతీయ నాయకత్వం వారికి చర్చలు జరిపామని ఆయన పార్టీ మారతానని జీవన్ రెడ్డి వెళ్తున్నారని మంత్రి అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసి ఓర్వలేక కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2014 నుండి 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నోరు జారలేదని మంత్రి గుర్తు చేశారు. అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో కేటీఆర్ కు అహంకారం ఎక్కువై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారని మంత్రి అన్నారు.
పదేళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని రాష్ట్ర కాంగ్రెస్ చెట్టు నీడగా ఉన్న ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. జీవన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని బీఆర్ఎస్ పార్టీ శిఖండి రాజకీయాలు చేస్తుందని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జగిత్యాలలో ఏర్పాటు చేసిన సభ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభనా..? జీవన్ రెడ్డి చేరిక సభనా..? చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారని, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. పార్లమెంటులో బీజేపీ మహిళా బిల్లు ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం నిర్వహించే ముఖ్యమంత్రి సభకు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రుప్లా నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంజిత్, పలు గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






