బీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన మల్లాపూర్ నేతలు

by Bhanu |

మండలంలో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

బీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన మల్లాపూర్ నేతలు
X

దిశ, మల్లాపూర్ : మండలంలో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మల్లాపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ భర్త బద్దం నర్సారెడ్డి, మాజీ ఎంపీటీసీ మెండు గంగారెడ్డి, ఎగరపు లింబాద్రి తదితరులు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వీరు కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు సమక్షంలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ కండువా ధరించి పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నామని బద్దం నర్సారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతి రెడ్డి, గడ్డం మహిపాల్, నల్ల రాజన్న, పుండ్ర శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story