- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నైపుణ్యం ఉంటేనే ఉజ్వల భవిష్యత్
నైపుణ్యం ఉంటేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ పేర్కొన్నారు.

దిశ, హుజురాబాద్ రూరల్ : నైపుణ్యం ఉంటేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఏఐఎంఎల్, ఈఈఈ విభాగాల జూనియర్ విద్యార్థుల ఆహ్వాన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని అలవరుచుకోవాలని సూచించారు. కార్పొరేట్ రంగంలో రాణించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అత్యవసరమని పేర్కొన్నారు. నేటి సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ విభాగం ఎంతో కీలకమని, ఇది అన్ని రంగాల్లో బహుళ ప్రయోజనకారిగా మారిందని ఆయన వివరించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు భవిష్యత్తులో ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగంతో పాటు సాఫ్ట్‌వేర్ రంగంలోనూ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని భరోసా ఇచ్చారు.
ప్లేస్‌మెంట్లలో కిట్స్ ప్రబంజనం..
కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం అందిస్తున్న శిక్షణ వల్ల ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు 100 మంది నాలుగో సంవత్సర విద్యార్థులు ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని డాక్టర్ శంకర్ సగర్వంగా ప్రకటించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కళాశాల రిజిస్ట్రార్ డాక్టర్ వి. రాజేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో కళాశాలకు హాజరు కావాలని కోరారు. మంచి హాజరు శాతం ఉన్న విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకుని, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు.






