24 గంటల్లో మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

by Bhanu |

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేటకు చెందిన 8ఏళ్ల బాలుడు మహమ్మద్ తాజుద్దీన్ గల్లంతయ్యిన ఘటన విషాదాన్ని కలిగించినా, 24 గంటలకే అతడి ఆచూకీని గుర్తించి పోలీసులు ఊపిరి పీల్చుకునేలా చేశారు.

24 గంటల్లో మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు
X

దిశ, ఎల్లారెడ్దిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేటకు చెందిన 8ఏళ్ల బాలుడు మహమ్మద్ తాజుద్దీన్ గల్లంతయ్యిన ఘటన విషాదాన్ని కలిగించినా, 24 గంటలకే అతడి ఆచూకీని గుర్తించి పోలీసులు ఊపిరి పీల్చుకునేలా చేశారు. వివరాల్లోకి వెళితే… సోమవారం రోజు బాలుడు కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన తరువాత తిరిగి ఇంటికి రాకపోవడంతో, బాలుడి పెద్దమ్మ స్థానిక ఎల్లారెడ్డిపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ నేరెళ్ల రమాకాంత్ నేతృత్వంలో పోలీస్‌ బృందాలు చురుగ్గా దర్యాప్తు ప్రారంభించాయి. పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, బాలుడు తన నానమ్మతో కలిసి సిద్ధిపేటకు వెళ్లినట్లు గుర్తించారు.

దీంతో మూడు ప్రత్యేక పోలీస్ బృందాలను సిద్ధిపేటకు పంపించి బాలుడిని అన్వేషించారు. చివరికి బాలుడిని క్షేమంగా గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కేంద్రానికి తరలించే చర్యలు చేపట్టారు. ఈ వేగవంతమైన దర్యాప్తు, విజయవంతమైన గాలింపు చర్యల పట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ స్థానిక ఎస్‌ఐ రమాకాంత్‌తో పాటు మిగతా పోలీసు సిబ్బందిని అభినందించారు.

Next Story