బక్రీద్ రోజున కోరుట్లలో కలకలం

by velandi.Saikiran |

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గురువారం రాత్రి మూగ జంతువు ఎముకలు రోడ్డుపై కనిపించడం కలకలం రేపింది.

బక్రీద్ రోజున కోరుట్లలో కలకలం
X

బక్రీద్ రోజున కోరుట్లలో కలకలం

రోడ్డుపై ఆవు ఎముకలు పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు

అప్రమత్తమైన పోలీసులు

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గురువారం రాత్రి మూగ జంతువు ఎముకలు రోడ్డుపై కనిపించడం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టణంలోని ముత్యాలవాడ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు, మూగ జంతువు ( ఆవు) కాళ్లు, ఇతర ఎముకలను రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ, తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

బక్రీద్ పర్వదినం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచారు. ఈ ఘటనపై పలు హిందూ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతోనే కొందరు కావాలనే ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.

Next Story