ఆలయ పునరుద్ధరణకు భారీ విరాళం

by velandi.Saikiran |

ఆలయ పునరుద్ధరణకు భారీ విరాళం అందించారు బోయినపల్లి శాంతపురావు సరిత దంపతులు

ఆలయ పునరుద్ధరణకు భారీ విరాళం
X

దిశ, పెగడపల్లి: ఆలయ పునరుద్ధరణకు భారీ విరాళం అందించారు బోయినపల్లి శాంతపురావు సరిత దంపతులు. మండల కేంద్రంలోని శ్రీ రాజ రాజేశ్వర స్వామి పాత బస్తీ హనుమాన్ ఆలయ పునరుద్ధరణ లో భాగంగా స్లాబ్ నిర్మాణం కోసం బోయినపల్లి శాంతపురావు సరిత దంపతులు మంగళవారం రోజున 2,25,000 రూపాయలను ఆలయ కమిటీకి అందజేశారు.

పుట్టిన ఊరు మీద మమకారంతో భక్తితో ఆలయ పునరుద్ధరణ కోసం తనవంతుగా భారీ విరాళం అందశారు. ఈ తరుణంలోనే... శాంతపురావు సరిత దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు అభినందించి ఘనంగా సన్మానించారు. ఆలయ కమిటీ సభ్యులు ఓరుగలి శ్రీనివాస్,శేఖర్ గౌడ్,పార్థ సారధి, బోగ గోపి,మాదరపు కిషన్ రావు,మాదరపు కరుణాకర్ రావు,గొల్లపల్లి రాం చంద్రం,తదితరులు ఇందులో ఉన్నారు.

Next Story