- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ..
జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన పుష్పాల శ్రీలత (32) బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా బ్లూ కోర్టు ఆమెను కాపాడారు.

దిశ, జమ్మికుంట రూరల్ : జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన పుష్పాల శ్రీలత (32) బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా బ్లూ కోర్టు ఆమెను కాపాడారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన పుష్పాల శ్రీలత కుటుంబకలహాలతో సతమతమవుతుంది.
దీంతో బుధవారం బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ కింద కూర్చుని ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న బ్లూ కోర్టు సిబ్బంది సారంగదరి హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్ జలీల్, ఆనంద్ సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలను కాపాడారు. అనంతరం జమ్మికుంట పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్ కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహిళా ప్రాణాలు కాపాడిన బ్లూ కోర్టు సిబ్బందిని జమ్మికుంట సీఐ రమేష్ అభినందించారు.






