- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైవే నిర్మాణం కోసం బ్లాస్టింగ్‌లు.. బెంబేలు ఎత్తుతున్న జనం
హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్, సిర్సపల్లి గ్రామాల శివారులో జాతీయ రహదారి 163 నిర్మాణంలో భాగంగా చేపడుతున్న బ్లాస్టింగ్ పనులతో సిర్సపెల్లి, రంగాపూర్ గ్రామాల రైతులు బెంబేలెత్తుతున్నారు.

బ్లాస్టింగ్ పనులతో హుజూరాబాద్ మండలంలోని సిర్సపెల్లి, రంగాపూర్ రైతులు, ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా గుట్టలను బ్లాస్టింగ్ చేయడంతో బండరాళ్లు ఎగిరి ఆయా గ్రామాల సమీపంలో పడుతున్నాయి. బండరాళ్లు ఇళ్లపై కూడా పడుతుండడంతో ఇళ్లు ధ్వంసమవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. బ్లాస్టింగ్ వల్ల బండరాళ్లు గ్రామాలలో, పంట పొలాల్లో పడుతున్నాయని డీబీఎల్ కంపెనీ వారికి, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోతాదుకు మించి మందుగుండును వినియోగించడం వల్లే బండరాళ్లు ఎగిరి పడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో ముందస్తు హెచ్చరికలు కూడా చేయడం లేదని తెలిపారు. డీబీఎల్ కంపెనీ 163 జాతీయ రహదారి కోసం తుమ్మనపల్లి గ్రామ శివారులో కంపెనీ క్యాంపును ఏర్పాటు చేసింది. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా సిర్సపల్లి, రంగాపూర్ గుట్టలను రోడ్డు నిర్మాణానికి కంకర రాళ్లు, మట్టి తీసేందుకు అనుమతి తీసుకుంది. అలాగే ఒక గుట్టను పూర్తిగా రోడ్డుకు అడ్డంగా రావడంతో తొలగిస్తుందని తెలిపారు. సమయపాలన పాటించకుండా ఈ ప్రాంతంలో బ్లాస్టింగ్ చేపడుతుండడంతో రాళ్లు ఎగిరి పడుతున్నాయని.. అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని రైతులు అంటున్నారు.
దిశ ,హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్, సిర్సపల్లి గ్రామాల శివారులో జాతీయ రహదారి 163 నిర్మాణంలో భాగంగా చేపడుతున్న బ్లాస్టింగ్ పనులతో సిర్సపెల్లి, రంగాపూర్ గ్రామాల రైతులు బెంబేలెత్తుతున్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా గుట్టలను బ్లాస్టింగ్ చేయడంతో సిర్సపల్లి ,రంగాపూర్ శివారు గ్రామాల రైతుల పంట పొలాల్లో బండరాళ్లు ఎగిరిపడుతున్నాయి. దీంతో పొలాలు ధ్వంసమవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ బ్లాస్టింగ్ ల వల్ల సిర్సపల్లి గ్రామంలో కొన్ని గృహాలు కూడా పగుళ్లు బారుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. బ్లాస్టింగ్ సమయంలో ముందస్తు హెచ్చరికలు కూడా చేయడం లేదు. నిషేధిత మందులు ఉపయోగిస్తూ బ్లాస్టింగ్ లు చేయడంతో పొలాల్లో పెద్ద పెద్ద బండ రాళ్లు పడుతున్నాయి. ఈ క్వారీకి సమీపంలో సిర్సపల్లి,రంగాపూర్ గ్రామాలకు చెందిన పదుల సంఖ్యలో రైతుల పొలాలు ఉండటంతో అందులో పెద్ద పెద్ద బండ రాళ్లు పడుతూ వరి పంటలు దెబ్బతింటున్నాయి. డీబీఎల్ కంపెనీ 163 జాతీయ రహదారి కోసం తుమ్మనపల్లి గ్రామ శివారులో కంపనీ క్యాంపును ఏర్పాటు చేసింది. ఈ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సిర్సపల్లి, రంగాపూర్ గుట్టలను రోడ్డు నిర్మాణానికి కంకర రాళ్లు, మట్టి తీసేందుకు అనుమతి తీసుకుంది. అలాగే ఒక గుట్టను పూర్తిగా రోడ్డుకు అడ్డంగా రావడంతో తొలగిస్తుంది. ఈ గుట్టలను బ్లాస్టింగ్లతో ప్రతిరోజు వలుస్తుంది. సమయపాలన పాటించకుండా ఈ ప్రాంతంలో బ్లాస్టింగ్ చేపడుతుండడంతో రాళ్లు ఎగిరి పడుతున్నాయి. తాము పొలాల్లో పనిచేస్తున్న సందర్భంలో సైతం బ్లాస్టింగ్ చేపడుతున్నారని తమ ప్రాణాలకు బండరాళ్లతో ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పచ్చని చెట్టు సైతం పొగగా మారుతున్నాయి. బ్లాస్టింగ్ సమయంలో నిషేధిత అమోనియం నైట్రేట్, పొటాషియం లాంటి మందులను వాడడం వల్ల బ్లాస్టింగ్ ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్లాస్టింగ్ జరుగుతున్న సమయాల్లో నిబంధనలు పాటించేలా చూడాలని సమీప పొలాల రైతుల్లో బండరాళ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అధికారుల కళ్ళకు ముడుపుల గంతలు..
డీబీఎల్ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా సిర్సపెల్లి, రంగాపూర్ శివారులోని గుట్టలను బ్లాస్టింగ్లతో తొలగిస్తున్నారని సమీప రైతులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. కంపెనీ నుంచి సంబంధిత అధికారుల కళ్ళకు ముడుపుల గంతలు కట్టడం వల్లే పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినవస్తున్నాయి.
ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు.. వీరబోయిన కొమురయ్య రైతు, సిర్సపల్లి
సిర్సపల్లి శివారులో నేను నాలుగెకరాల వరి పొలం వేశాను. ఆ పొలం ఇప్పుడు పొట్ట దశలో ఉంది. ఇందుకు ఎకరానికి రూ.30 వేల పెట్టుబడి పెట్టా. డీబీఎల్ కంపెనీ చేస్తున్న బ్లాస్టింగ్ వల్ల నా పొలంలో పెద్దపెద్ద బండరాళ్లు పడుతున్నాయి. ఆ రాళ్లు పడడం వల్ల వరి కర్రలు లేచిపోయి గుంతలు ఏర్పడుతున్నాయి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ బ్లాస్టింగ్ ల వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. పొలాల్లో పనిచేస్తున్నప్పుడు కూడా బండరాళ్లు ఎగిరి పడుతున్నాయి. మా పొలాలకు, మా ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.
తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం.. మైనింగ్ ఏజీ వెంకటేశ్వర రావు
డీబీఎల్ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ చేయడం పై తనిఖీలు చేపడతాం. ఏడి దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటాం. నిషేధిత మందులు వాడినా.. నిబంధనలు పాటించకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.






