'నమో యువ కాంక్లేవ్' విజయవంతం చేయండి: బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

by Kodari Anjali |

ఈ నెల 19న కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న 'నమో యువ కాంక్లేవ్' యువ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రవీణ్ రెడ్డి పిలుపునిచ్చారు.

నమో యువ కాంక్లేవ్ విజయవంతం చేయండి: బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
X

దిశ,​ హుజురాబాద్ రూరల్: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో 'నమో యువ కాంక్లేవ్' పేరిట భారీ యువ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని 21వ వార్డు కౌన్సిలర్ పంజాల మనోజ్ కార్యాలయంలో బీజేవైఎం హుజురాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రవీణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

​తరలిరావాలని పిలుపు...

​ఈ నెల 19న కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న 'నమో యువ కాంక్లేవ్' యువ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రవీణ్ రెడ్డి పిలుపునిచ్చారు. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యువత, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆయన కోరారు. మోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సుపరిపాలనను యువతలోకి బలంగా తీసుకెళ్లడమే ఈ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పంజాల మనోజ్, బీజేవైఎం హుజురాబాద్ రూరల్ మండల అధ్యక్షులు నరెడ్ల చైతన్య రెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ తూర్పాటి శంకర్, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డిలతో పాటు దేవగౌడ్, ప్రదీప్, రాకేష్, నవీన్, హృతిక్, అనిల్, శివనాగరాజు, శ్రీపాల్ రెడ్డి, రమేష్, శ్రీధర్, వినయ్, రాకేష్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story