- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కబ్జా యత్నాలపై బీజేపీ నిరసన..
హుజూరాబాద్ ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ భూమిని రక్షించాలని బీజేపీ నాయకులు ఆర్‌డీఓకు వినతిపత్రం అందించారు.

దిశ, హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాల గ్రౌండ్‌కు చెందిన విలువైన ప్రభుత్వ భూమిని భూకబ్జాల నుండి తక్షణమే రక్షించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కళాశాల గ్రౌండ్ వద్ద నిరసన తెలిపి, అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) జల కుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు మాట్లాడుతూ.. వేలాది మంది విద్యార్థులు, యువకులు క్రీడా కార్యకలాపాల కోసం ఉపయోగించుకునే ఏకైక ప్రభుత్వ కళాశాల గ్రౌండ్‌పై కొందరు భూబకాసురుల కన్ను పడిందని ఆరోపించారు. ఇటీవల కాలంలో ఈ భూమిని కబ్జా చేసేందుకు ముఠాలు ప్రయత్నిస్తున్నట్లు విద్యార్థులు, స్థానిక ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. కళాశాలలకు సెలవులు ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకొని, రాత్రికి రాత్రే జేసీబీలతో భూమిని చదును చేస్తూ ఆక్రమణలకు పాల్పడటం అత్యంత ఆందోళనకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలి..
ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ భూమిపై వెంటనే అధికారికంగా సర్వే నిర్వహించి, స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేయాలని, కబ్జాలకు ఆస్కారం లేకుండా గ్రౌండ్ చుట్టూ తక్షణమే శాశ్వత ప్రహరీ గోడ (కాంపౌండ్ వాల్) నిర్మించాలన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించిన సూత్రధారులను గుర్తించి, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి అని, వాటిని కాపాడాల్సిన కనీస బాధ్యత రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంపై ఉందని ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు. విద్యార్థుల క్రీడా అవసరాలు, భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, సీనియర్ నాయకులు, సెంట్రల్ ఫిలిం బోర్డు మెంబర్ సబ్బని రమేష్, నాయకులు యాంసాని శశిధర్, నరాల రాజశేఖర్, తిప్పబతిని రాజు, యాళ్ల సంజీవరెడ్డి, అంకటి వాసు, బోరగాల సారయ్య, కొడిమ్యాల పవన్, కొలిపాక వెంకటేష్, పడారి సుమన్, కొలుగూరి అనిల్, మోటపోతుల రాకేష్, క్యాస వెంకటేష్, డోరి ఐలయ్య, పర్ధం విజయ్ సహా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






