- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ నాయకుల సంఘీభావం.. పలువురు అరెస్ట్
ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు సంరక్షణ కేంద్రంలో జరిగిన బాలింతల వరుస మరణాల పట్ల ఆగ్రహించిన బంధువులు సోమవారం ప్రజవాణి లో నిరసనకు దిగారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు సంరక్షణ కేంద్రంలో జరిగిన బాలింతల వరుస మరణాల పట్ల ఆగ్రహించిన బంధువులు సోమవారం ప్రజవాణి లో నిరసనకు దిగారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలింతలు మరణించారంటూ ఆరోపిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను విధుల నుండి తొలగించాలని సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన డాక్టర్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. బాధితుల కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆగ్రహించిన బీజేపీ నాయకులు మృతుల బంధువులతో కరీంనగర్ -జగిత్యాల రోడ్డుపై బైఠాయించారు.ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.దీనితో కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు బీజేపీ నియోజకవర్గ నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి తో పాటు ఇతర నాయకులను అరెస్ట్ చేశారు.
Read More: బండి పాదయాత్ర లాంఛనంగా ప్రారంభం






