- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీలోకి భోగ శ్రావణి
by S Gopi |
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బాధ్యతల నుండి తప్పుకోవడంతోపాటు కౌన్సిలర్ పదవికి, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి... Bhoga Sravani joins BJP

X
దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బాధ్యతల నుండి తప్పుకోవడంతోపాటు కౌన్సిలర్ పదవికి, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన భోగ శ్రావణి బుధవారం బీజేపీ గూటికి చేరారు. ఈ మేరకు ఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో శ్రావణి, ఆమె భర్త భోగ ప్రవీణ్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
Next Story






