ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యం: ఎస్పీ భాస్కర్

by S Gopi |   (  Updated:2023-01-28 10:04:18  IST  )

జిల్లా పరిధిలోని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల భద్రత, రక్షణ తమ ప్రధాన లక్ష్యం...Bhasker IPS took charge as SP of Jagityal

ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యం: ఎస్పీ భాస్కర్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జిల్లా పరిధిలోని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల భద్రత, రక్షణ తమ ప్రధాన లక్ష్యం అని జిల్లా ఎస్పీ భాస్కర్ తెలిపారు. నూతనంగా జిల్లా ఎస్పీగా నియమించబడ్డ భాస్కర్ జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో సింధు శర్మ నుండి భాద్యతలు స్వీకరించారు. అంతకుముందు భాద్యతల స్వీకరణ కోసం వచ్చిన భాస్కర్ కి పోలీసులు గౌరవ వందనం సమర్పించి పుష్ప గుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. భాద్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల భద్రత కోసం పోలీసింగ్ వ్యవస్థ ఉంటుందని, శాంతి భద్రతల విషయంలో ఎవరు విఘాతం కలిగించినా, విద్వేషాలు రెచ్చగొట్టిన కఠీన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story