- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంథనిలో భానుడి భగ భగ
పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎండలు భగ్గు మంటున్నాయి. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతోంది.

దిశ, మంథని : పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎండలు భగ్గు మంటున్నాయి. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతోంది. మే నెలలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. బుధవారం మంథనిలో మధ్యాహ్నం సమయంలో 44 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత ఉంటుంది. మధ్యాహ్నం 12 తర్వాత జనాలు రోడ్ల మీదకు రావాలంటే భయపడుతున్నారు. ఎండ వేడికి భయపడి ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మంథని పట్టణం నిర్మాణుష్యం అయింది. ఎండ తీవ్రతతో జనాలు రాకపోవడంతో వ్యాపారం లేక వ్యాపారులు షేటర్లు బంద్ చేసి ఇళ్లకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎండ తీవ్రత తగ్గినా తర్వాత సాయంత్రం 5 దాటితే కానీ రోడ్ల మీదకు జనాలు రావడం లేదు. ఉదయం 11 లోపు, తిరిగి సాయంత్రం 4 తర్వాత మాత్రమే బయట రావాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావద్దని నిపుణులు పేర్కొంటున్నారు.






