భక్తుల ముంగిటకే 'భద్రాద్రి' తలంబ్రాలు

by Ratna Kumari |

భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకల పవిత్ర తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేసేందుకు టీజీఆర్టీసీ కార్గో విభాగం నడుం బిగించింది.

భక్తుల ముంగిటకే భద్రాద్రి తలంబ్రాలు
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్ : భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకల పవిత్ర తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేసేందుకు టీజీఆర్టీసీ కార్గో విభాగం నడుం బిగించింది. భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక సేవల పోస్టర్‌ను హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం 151 రూపాయలు చెల్లించి తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చనని అన్నారు. ఈ ప్యాకెట్‌లో పవిత్ర అక్షింతలతో పాటు రెండు ముత్యాలు కూడా ఉంటాయని తెలిపారు. బుక్ చేసుకున్న భక్తుల ఇంటికే నేరుగా ఆర్టీసీ సిబ్బంది వచ్చి తలంబ్రాలను అందజేస్తారని అన్నారు. ఈ తలంబ్రాలను శుభకార్యాల్లో అక్షింతలుగా వాడటం వల్ల శ్రీరాముడి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అని పేర్కొన్నారు. భక్తులు భద్రాద్రి వెళ్లలేకపోయినా, వారి ఇంటి వద్దకే స్వామివారి ప్రసాదాన్ని చేరవేసేలా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ మేనేజర్ సారయ్య పాల్గొన్నారు.

ఎలా బుక్ చేసుకోవాలంటే..?

భక్తులు తమకు దగ్గరలో ఉన్న ఆర్టీసీ కార్గో సెంటర్ల వ‌ద్ద లేదా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ల వద్ద తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకోవచ్చని మేనేజర్ తెలిపారు. పూర్తి వివరాలకు చంద్రమౌళి (మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్) సెల్, 9154298559 ను సంప్రదించాలని కోరారు.

Next Story