హుజురాబాద్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం

by Elthuri vijay kumar |

హుజురాబాద్ ప్రాంతంలోని పేద ప్రజలకు హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేబుల్ హెల్త్ సర్వీస్ డాక్టర్ ఎల్. కృష్ణ ప్రసాద్ తెలిపారు.

హుజురాబాద్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం
X

హుజురాబాద్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం

-డీసీహెచ్ డాక్టర్ కృష్ణ ప్రసాద్

దిశ,హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ ప్రాంతంలోని పేద ప్రజలకు హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేబుల్ హెల్త్ సర్వీస్ డాక్టర్ ఎల్. కృష్ణ ప్రసాద్ తెలిపారు. మంగళవారం హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో రోగులకు అందే వైద్య చికిత్సలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.నారాయణరెడ్డితో సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 23,761 రక్త పరీక్షలు నిర్వహించినట్లు, ఆగస్టు నెలలో 109 లాప్ పరీక్షలు, 13,510 మంది అవుట్ పేషెంట్లకు చికిత్సలు జరిపామని, 1,083 మందిని ఇన్ పేషెంట్లుగా చేర్చుకున్నట్లు ఆయన తెలిపారు.ఆస్పత్రిలో 106 మందికి మేజర్ శస్త్ర చికిత్సలు, 334 మందికి మైనర్ శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 13 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, 103 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు జరిగినట్లు ఆయన తెలిపారు. ఇంతే కాకుండా 423 మంది గర్భిణీ స్త్రీలకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ లు, 964 మందికి ఎక్స్‌రేలు తీసినట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల సహకారంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు మరిన్ని సౌకర్యాలను కల్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలుసుకోవడానికి వచ్చే బంధువులు వైద్యులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను సందర్శన వేళలను ఏర్పాటు చేసినట్లు ఆ సమయంలోనే వారు రావాలని సూచించారు. ఇంతే కాకుండా కార్పొరేట్ ఆసుపత్రుల లో జరిగే వైద్య చికిత్సలను హుజురాబాద్ ఆసుపత్రిలో లభిస్తున్నట్లు పేద ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. త్వరలోనే ఆసుపత్రికి స్కానింగ్ మిషన్ రానుందని దీనికి తోడు మరిన్ని మెరుగైన చికిత్సలు జరుపుతామని ఈ ప్రాంత ప్రజలు ఆసుపత్రిలో అందించే వైద్య సేవలను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సమీక్షలో కరీంనగర్ వైద్య విధాన పరిషత్ ఏడి నజీముల్లా , ఏవో అహ్మద్, డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story