- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, జగిత్యాల టౌన్ : డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారులను రెండు నెలల్లో ఎంపిక చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు లబ్దిదారులను ఎంపిక చేయుటకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో నిర్మించిన సమీకృత మార్కెట్ ను ప్రజలకు ఉపయోగములోకి తీసుకరావాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. నూకపల్లి అర్బన్ కాలనిని అమృత్ స్కీమ్ కు టై అప్ చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో మధుసూదన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Next Story






