- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి హామీ కూలీల పై తేనెటీగల దాడి.. వంద మందికి పైగా గాయాలు
by samatah |
కొడిమ్యాల మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీల పై తేనెటీగల దాడి జరిగి సుమారు వంద మందికి పైగా గాయపడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.కూలీలు తెలిపిన వివరాల ప్రకారం మంగళ వారం ఉదయం బూరుగు

X
దిశ, కొడిమ్యాల :కొడిమ్యాల మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీల పై తేనెటీగల దాడి జరిగి సుమారు వంద మందికి పైగా గాయపడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.కూలీలు తెలిపిన వివరాల ప్రకారం మంగళ వారం ఉదయం బూరుగు కుంట ప్రాంతంలో కులీలు పనిలో నిమగ్నమై వుండగా అకస్మాత్తు గా తేనెటీగలు దాడి చేసాయని తెలిపారు.దాడి జరిగన సమయంలో సుమారు రెండు వందల మంది పనిచేస్తున్నట్లు వారు తెలిపారు.గాయపడిన వారిని స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స ను అందించారు.తీవ్రంగా గాయపడ్డా పది మంది నీ జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించి నట్లు ఈజీఎస్ ఏపివో సతీష్ తెలిపారు.
Next Story






