- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త కలెక్టరేట్ ను సుందరంగా తీర్చిదిద్దండి
మిగిలిపోయిన పనులను సత్వరమే పూర్తి చేసి, కొత్త కలెక్టరేట్ ను సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ చిత్ర మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కొత్త కలెక్టరేట్ ను సందర్శించి పనులను పరిశీలించారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : మిగిలిపోయిన పనులను సత్వరమే పూర్తి చేసి, కొత్త కలెక్టరేట్ ను సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ చిత్ర మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కొత్త కలెక్టరేట్ ను సందర్శించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ మ్యాపును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫినిషింగ్ పనులు మిగిలి ఉన్న పనులు సత్వరమే పూర్తి చేసి కలెక్టరేట్ ను అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రధాన గేటు నిర్మాణం ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు విద్యుత్ పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. ప్రతి అంతస్తులో ఎక్కడా ఎలాంటి పనులు పెండింగ్ లో ఉంచవద్దన్నారు. వీటిపై ప్రత్యేక పర్యవేక్షణ జరిపి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సరఫరా పైపులైను పనులు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అన్ని పనులను సత్వరమే పూర్తి చేసి కలెక్టరేట్ ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు పనుల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఆర్డీవో కే మహేశ్వర్ ఆర్ అండ్ బీ ఈఈ నరసింహ చారి ఎలక్ట్రికల్ ఈఈ కమలేష్ అధికారులు పాల్గొన్నారు.






