- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రెడిట్ కార్డ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఆన్ లైన్ క్రెడిట్ కార్డ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.

క్రెడిట్ కార్డ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
గుర్తు తెలియని నంబర్ కాల్స్, లింక్స్ ఓపెన్ చేయొద్దు
అనుమానిత కాల్స్ పై 1930 కు సమాచారం ఇవ్వాలి
ఎస్పీ అశోక్ కుమార్
దిశ జగిత్యాల్ టౌన్: ఆన్ లైన్ క్రెడిట్ కార్డ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఆన్లైన్ క్రెడిట్ కార్డు మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయని, గుర్తు తెలియని నెంబర్ నుండి వచ్చే ఫోన్ కాల్స్, సందేహాలు, లింకులను నమ్మి ఎవరు తమ క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీలు, పిన్ నెంబర్లు, చెప్పకూడదని సూచించారు. బ్యాంకులు ఎప్పుడు ఫోన్ లేదా సందేహం ద్వారా వ్యక్తిగత వివరాలు అడగరని, అలాంటి కాల్స్ వస్తే వెంటనే డిస్కనెక్ట్ చేసి, 1930 హెల్ప్ లైన్ నెంబర్ కి సమాచారం ఇవ్వాలని ఎస్పి సూచించారు. ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






