- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని గోదావరిఖని మున్సిఫ్ కోర్టు మేజిస్ట్రేట్ లు నల్లాల వెంకట సచిన్ రెడ్డి, రామగిరి స్వారిక అన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
గోదావరిఖని మున్సిఫ్ మేజిస్ట్రేట్లు సచిన్ రెడ్డి, స్వారిక
దిశ, గోదావరిఖని: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని గోదావరిఖని మున్సిఫ్ కోర్టు మేజిస్ట్రేట్ లు నల్లాల వెంకట సచిన్ రెడ్డి, రామగిరి స్వారిక అన్నారు. శుక్రవారం గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదనపు జిల్లా న్యాయస్థానం ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పువ్వులనే దేవతలుగా భావించి, పూజించే మహాత్తర వేడుక బతుకమ్మ అని అన్నారు. అనంతరం మహిళా న్యాయవాదులు సిబ్బందితో కలిసి మహిళ జడ్జీలు బతుకమ్మ వేడుకల్లో ఆడి పాడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు తౌటం సతీష్, సంజయ్ కుమార్, నాయకులు భారతి చౌహాన్, శోభ, సబా తబస్సుమ్, గోపాల్ రెడ్డి, ముచ్చకుర్తి కుమార్, పంగ శంకర్, రాగం శ్రీధర్ , పులిపాక రాజ్ కుమార్, ఉమర్, న్యాయవాదులు పాల్గొన్నారు.






